అక్కడ వృద్ధులు యువకులుగా కనిపిస్తారు!

Telugu Lo Computer
0


అక్కడి ప్రజలు 60 ఏళ్ల వయసులో కూడా 30-40 ఏళ్లవారిగా కనిపిస్తారు. పైగా 120 సంవత్సరాల వరకు జీవిస్తారు. దీనికి వారి అలవాట్లే కారణమని తేలింది. ఈ ప్రదేశం మన పొరుగు దేశం పాకిస్తాన్‌లో ఉంది. పాకిస్తాన్‌లోని హిమాలయాల ఒడిలో హుంజా వ్యాలీ ఉంది. హుంజా వ్యాలీలో అత్యంత ఆరోగ్యవంతమైన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని సమాచారం. ఇక్కడ ప్రజలు 120 సంవత్సరాలకు పైగా జీవిస్తారని, చాలా ఆరోగ్యంగా ఉంటారని పలు నివేదికలు తెలిఫుతున్నాయి. ఇక్కడి వృద్ధ మహిళలు 60 ఏళ్లు పైబడినా 40 ఏళ్ల వయస్సు గల స్త్రీల మాదిరిగా యవ్వనంగా మరియు చురుకుగా కనిపిస్తారు. ఈ ప్రాంత ప్రజలను కేన్సర్ తాకలేదు. ఇక్కడి జీవనశైలే దీనికి ముఖ్యమైన కారణం. హుంజా ప్రజలు తమ ఆహారంలో ఎండలో ఎండబెట్టిన వాల్‌నట్‌లు మరియు ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా తింటారని పరిశోధకులు తమ నివేదికలో తెలిపారు. అంతేకాకుండా ఇక్కడివారు తమ రోజువారీ ఆహారంలో పచ్చి కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, గింజలు, పాలు, గుడ్లు మరియు జున్ను తీసుకుంటారు. తక్కువ మానసిక ఒత్తిడి కారణంగా ఇక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారని, దీర్ఘ జీవితాన్ని గడుపుతారని తేలింది.

Post a Comment

0Comments

Post a Comment (0)