ఆ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా కలిచివేసింది !

Telugu Lo Computer
0


శ్యామ్ సింగరాయ్ సినిమా లో దేవదాసి పాత్రలో నటించిన సాయిపల్లవి తన నటన, డ్యాన్సులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవదాసి పాత్రలో సాయిపల్లవి అందంగా లేదంటూ ఓ తమిళ పత్రిక వార్త ప్రచురించగా, దానిపై పెద్ద యెత్తున వివాదం చెలరేగింది. ఓ టాలెంటెడ్ నటిపై బాడీ షేమింగ్‌ చేయడం మంచి పద్ధతి కాదని చాలామంది ఖండించారు. తాజాగా ఈ వివాదంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. సాయిపల్లవిపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలకు పాల్పడటం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె పేర్కొన్నారు. ఓ తమిళ ఛానల్‌తో మాట్లాడిన తమిళసై తాను కూడా తన రూపం పట్ల చాలాసార్లు ట్రోలింగ్‌కు గురయ్యానన్నారు. అయితే అలాంటి వాటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఎగతాళి చేసేవారికి ఎదుటి వారి భాద తెలియదని తానూ చాలా బాధపడ్డా కానీ ప్రతిభ, శ్రమతో వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని స్వయానా ఆమె తన ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)