ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలను చిప్ కొరత, సప్లై చైన్ రంగం తీవ్రంగా దెబ్బ తీశాయి. గత ఏడాది ఆయా కంపెనీల ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. 2021లో జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మాత్రం రికార్డు స్థాయిలో అమ్మకాలను జరిపింది. జపాన్‌కు చెందిన టయోటా మోటార్ కో శుక్రవారం తన వాహన విక్రయాలు 2021లో గణనీయంగా 10.1 శాతం పెరిగాయని ఒక ప్రకటనలో పేర్కొంది. వరుసగా రెండో ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించి టయోటా రికార్డులు క్రియేట్ చేసింది. సమీప ప్రత్యర్థి జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ ఏజీ కంటే మరింత ముందుందని టయోటా తెలిపింది. అనుబంధ సంస్థలైన డైహట్సు మోటార్స్ , హినో మోటార్స్‌తో సహా 2021లో 10.5 మిలియన్(కోటీకిపైగా) వాహనాల అమ్మకాలు జరిపినట్లు టయోటా వెల్లడించింది.
2021లో కోటి కార్లు అమ్మిన టయోటా !
January 29, 2022
0
Tags