గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీని తీసేందుకు బయటకు వచ్చిన ఓ వ్యక్తిపై ఎద్దు దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వ్యక్తిపై దాడి చేసింది. కొమ్ములతో కుమ్మితే ఆ వ్యక్తి చొక్కా కొమ్ములకు చిక్కుకోవడంతో చాలా దూరంలో వెళ్లిపడ్డాడు. ఆయనను కాళ్లతో తొక్కుతూ, కొమ్ములతో కుమ్ముతూ నానా బీభత్సం చేసింది. ఇంతలో ఆయన కేకలు విని ఇంట్లో నుంచి ఇద్దరు మహిళలు బయటకు వచ్చారు. ఆ ఎద్దును పక్కకు పంపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. ఓ మహిళపై కూడా ఎద్దు విరుచుకుపడింది. కొంతసేపటికి స్థానికులు కొందరు కర్రలతో వచ్చి ఆ ఎద్దును బెదిరించడంతో అక్కడ
నుంచి వెళ్లిపోయింది.
స్కూటీ తీసేందుకు వెళితే....!
December 07, 2021
0
Tags