ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేట్ కొలువులకు రిటైర్మెంట్ తరువాత పెన్షన్ అందే సౌకర్యం ఉంది. కానీ, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల పరిస్థితి దీనికి భిన్నం. వీరికి రిటైర్మెంట్ అనే పదం అంటేనే భయం పుడుతుంది. ఎందుకంటే.. పని మానేసి ఇంటిలో కూచుంటే వారికి కాలం గడిచే పరిస్థితి ఉండదు. అందుకోసమే.. ఇటువంటి వారికి సహకరించేలా రెండేళ్ళ క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక పధకాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ పధకంలో చేరే వారి సంఖ్యా ఎక్కువ అవుతుంది. ఈ పథకం పేరు ప్రధాన్ మంత్రి శ్రమయోగి మంధన్ యోజన అంటే (పిఎంఎస్ వైఎం). అసంఘటిత రంగ కార్మికులకు నెలవారీ పింఛను అందించేందుకు 2019లో ఈ పథకాన్ని ప్రారంభించారు. 60 ఏళ్లు నిండిన అసంఘటిత రంగ కార్మికులకు నెలకు 3,000 రూపాయల పింఛను అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. పిఎంఎస్ వైఎం స్కీమ్‌కు విశేష స్పందన లభించింది. ఇప్పటి వరకు అసంఘటిత రంగానికి చెందిన 45,77,295 మంది కార్మికులు ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు. ఈ పథకంలో చేరడానికి కనీస వయసు 18 సంవత్సరాలు. గరిష్ట వయసు 40 సంవత్సరాలు.18 సంవత్సరాల వయసులో ఈ పథకంలో చేరితే నెలకు 55 రూపాయలు చెల్లించాలి. 19 సంవత్సరాల వయసులో ఈ పథకంలో చేరితే నెలకు 100 రూపాయలు చెల్లించాలి. 40 ఏళ్ల వయసు వారు ఈ పథకంలో చేరితే నెలకు 200 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో చేరి ప్రతి నేలా నిర్దేశిత మొత్తం చెల్లించిన వారికి 60 ఏళ్ల వయసు వచ్చిన తరువాత నెలకు 3 వేల రూపాయలు చెల్లిస్తారు. ఇలా ప్రతినెలా ఈ పథకంలో వయోజనులకు సొమ్ము చెల్లిస్తారు. ఈ పథకం కార్మికులు, డ్రైవర్లు, గృహ కార్మికులు, తోలు కార్మికులు, రిక్షా పుల్లర్లు మొదలైన అసంఘటిత రంగాలకు చెందిన వ్యక్తుల కోసం ఈ పథకం ఉద్దేశించారు.
రోజుకు రు. 2 చెల్లిస్తే నెలకు రు. 3 వేల పింఛను
December 07, 2021
0