వరద బాధితులకు ప్రభాస్ విరాళం రూ.కోటి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఆపద అంటే ముందుండే సినీతారులు మరోసారి స్పందిస్తూ విరాళాలు అందజేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినీనటుడు ప్రభాస్ కూడా తన వంతుగా వరద బాధితులకు సహాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాగార్జునతో సహా పలువురు సినీ పరిశ్రమ నుంచి విరాళాలు అందించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)