ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించంది. గత నెల 27న ఐర్లాండ్ నుంచి ముంబై వచ్చిన 34 ఏళ్ల ప్రయాణికుడికి ముంబైలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా కోవిడ్ నెగెటివ్‌గా వచ్చింది. దీంతో ముంబై నుంచి సదరు ప్రయాణికుడు విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలానికి వెళ్లాడు. అక్కడ మరోసారి టెస్ట్ చేయగా ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. దీంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. అధికారులు బాధితుడిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించింది. విదేశాల నుంచి వచ్చిన 15 మంది శాంపిల్స్ జీనోమ్ టెస్టింగ్ కోసం పంపితే పది శాంపిళ్లకు నివేదికలు అందాయని.. వాటిలో ఒక కేసు మాత్రమే ఒమిక్రాన్‌గా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
December 12, 2021
0