తాగు, సాగు నీరుతో ఇబ్బందున్నా స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేశాం

Telugu Lo Computer
0


విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మానుకోవాలని జనసేన సీనియర్ నేత పంతం నానాజీ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి తూర్పుగోదావరి జిల్లా రైతులు సంఘీభావం తెలుపుతున్నాం అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తే ఏలేరు కాల్వ గేట్లు మూసేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమే గతంలో మేం ప్రభుత్వం ఎంతిస్తే అంత పరిహరం తీసుకుని భూములిచ్చాం. మాకు తాగు, సాగు నీరుతో ఇబ్బందున్నా స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేశాం. స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తే మా నీటిని విశాఖ ప్రజలకిస్తాం కానీ, స్టీల్ ప్లాంటుకు ఇవ్వం. రోజుకు 300 క్యూసెక్కుల నీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం సరఫరా అవుతోంది. ఆ నీటిని ఆపేస్తే మా జిల్లాలో 40 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. ప్రైవేటీకరించే స్టీల్ ప్లాంట్ కోసం మా నీటిని ఇవ్వం అన్నారు నానాజీ. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం పునారాలోచించాలని, ఆ ప్రతిపాదనను విరమించుకోవాలన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)