కోలీవుడ్ హీరోలు అందుకునే రెమ్యునరేషన్ కూడా హై రేంజ్ లో ఉంటుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి మొదటి నుంచి తెలుగు తదితర భాషల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఈయన నటించే సినిమాకు 50కోట్ల వరకూ అందుకుంటారని ఒక టాక్. అలాగే సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా పిలిచే కమల్ హాసన్ కూడా 25నుంచి 30కోట్లు ఒక్కో సినిమాకు అందుకుంటూ బిజీగా ఉన్నారు. హీరో అజిత్ కి కూడా తమిళంతో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఒక్కో సినిమాకు 42నుంచి 50కోట్లు అందుకుంటాడని టాక్. విజయ్ సంగతి చెప్పక్కర్లేదు. యితడు ఒక్కో మూవీకి 45నుంచి 50కోట్లు అందుకుంటాడని అంటున్నారు. తమిళంతో సమానంగా తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్న సూర్య ఒక్కో సినిమాకు 20 - 22కోట్ల వరకూ అందుకుంటాడని, హీరో ధనుష్ అయితే 15కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి తమిళంలో బిజీగా ఉంటూనే తెలుగులో కూడా చేస్తున్నాడు. యితడు ఒక్కో సినిమాకు 8నుంచి 12కోట్లు తీసుకుంటున్నాడట. మరో హీరో శివకార్తికేయన్ కూడా ఇదే రేంజ్ లో అందుకుంటున్నా డని అంటున్నారు. కార్తీ ఒక్కో సినిమాకు 8 నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటాడు. ఇక విక్రమ్ విషయానికి వస్తే ఒక్కో సినిమాకు 20 కోట్ల వరకు తీసుకుంటాడు.
తమిళనాట టాప్ రెమ్యునరేషన్ హీరోలు
December 14, 2021
0