పశ్చిమ బెంగాల్‌లోని మల్బజార్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్ అక్కడి వన్యప్రాణులకు ఒక డెత్ ట్రాప్‌లా మారింది. రైళ్లు ఢీకొని తరచూ వన్య ప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. రైలు ఎదురుగా దూసుకొస్తున్నప్పటికీ ఏనుగు రైల్వే ట్రాక్ పైనే ఉండిపోయింది. అదే ట్రాక్‌పై ఉన్ననెమలి మాత్రం రైలు దగ్గరికి రాగానే ఒక్కసారిగా పక్కకు ఎగిరింది. ఏనుగు ట్రాక్ పైనుంచి కదలకపోవడంతో డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. రైలు పూర్తిగా స్లో అయ్యాక గానీ ఆ ఏనుగు ట్రాక్ నుంచి తప్పుకోలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా రైలు వెళ్లే స్పీడ్‌లో అన్నిసార్లు ఎమర్జెన్సీ బ్రేక్ సాధ్యం కాదు. ప్యాసింజర్ రైలు అయితే ఎమర్జెన్సీ బ్రేక్‌తో రిస్క్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు బోగీలు పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది. అందుకే రైలు ఎదురుగా ఎవరైనా నిలబడినా... వారిని ఢీకొట్టి వెళ్లడమే తప్ప రైలును ఆపే పరిస్థితి ఉండదు. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఏనుగును కాపాడటంతో అతనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
దూసుకొస్తున్న రైలు - ట్రాక్‌పై ఏనుగు
December 14, 2021
0