బరాత్‌లో పరుగులు పెట్టిన గుర్రం

Telugu Lo Computer
0


పెళ్లి జరుగుతున్న సమయంలో జరిగే చిన్న చిన్న సరదా సంఘటనలకు చెందిన వీడియోలను వారు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. పెళ్లి సమయంలో వివిధ రకాల సన్నాహాలు జరుగుతుంటాయి. ఈ రోజుల్లో పెళ్లికి సంబంధించిన ఇలాంటి వీడియో ఇంటర్నెట్‌లో హాట్ హాట్‌గా మారుతున్నాయి. పెళ్లి తర్వాత బరాత్ నిర్వహించడం కామన్‌గా జరుగుతుంది. ఆ సమయంలో జరిగిన ఓ సరదా సన్నివేశమే ఈ రోజు ట్రెండింగ్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో వరుడు పంచకళ్యాణి గుర్రం స్వారీ చేస్తూ అక్కడికి చేరుకుంటాడు. అతనికి స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఏర్పాట్లు చేస్తుంటారు. పెద్ద ఎత్తున బ్యాండ్‌ బాజా మోగుతుంటుంది. అయితే అక్కడికి వచ్చినవారు బాణాసంచా కాల్చడం మొదలు పెడతారు. ఆ భారీ శబ్ధం విన్న గుర్రం పరుగులు మొదలు పెడుతుంది. ఆ గుర్రాన్ని కట్టడి చేసేందుకు ఎంత ప్రయత్నించినా దొరకకుండా పోవడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


Post a Comment

0Comments

Post a Comment (0)