ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నుంచి పెదకూరపాడు మధ్య రైల్లో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారం జరిగింది. రన్నింగ్ ట్రైన్ లో బోగిలోకి ఎక్కిన వ్యక్తి కామాంధుడిగా మారి మహిళపై అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ మహిళ రాజమహేంద్రవరంలో సంత్రగచి ప్రత్యేక రైలు ఎక్కింది. గుంటూరుకు చేరుకునే సమయానికి ఆమె ప్రయాణిస్తున్న బోగీ పూర్తిగా ఖాళీ అయింది. తోటి ప్రయాణికులు దిగిపోయిన సమయంలో ఓ 40ఏళ్ల వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి రన్నింగ్ ట్రైన్ లో మహిళ ఉన్న బోగీలోకి ఎక్కాడు. మహళ ఒంటరిగా ఉందని గమనించి మహిళను కత్తితో బెదిరించి హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్, డబ్బులు లాక్కొన్నాడు. అంతటితో ఆగకుండా రన్నింగ్ ట్రైన్ లోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత పెదకూరపాడు స్టేషన్ వద్ద రైలు ఆగగానే, దిగి పరారయ్యాడు. బాధిత మహిళ చర్లపల్లికి రాగానే నేరుగా సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను సంప్రదించింది. రైలులో తనపై జరిగిన అఘాయిత్యంపై వారికి ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. పెదకూరపాడు స్టేషన్ వద్ద సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.
మహిళను కత్తితో బెదిరించి కదిలే రైలులో అత్యాచారం చేసిన కామాంధుడు !
October 15, 2025
0
Tags