హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మూడో రోజు 13 నామినేషన్లు దాఖలు కాగా ఇప్పటి వరకు 30 మంది అభ్యర్థులు 35 నామినేషన్లు దాఖలు చేశారు. నియోజకవర్గంలో 3,98,982 మంది ఓటర్లు, 2,07,367 పురుషులు, 1,91,530 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 89 లక్షల రూపాయలు పట్టుకున్నామని అధికారులు వెల్లడించారు. దాఖలు గడువు అక్టోబర్ 21 వరకు ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. అనంతరం నామినేషన్ పత్రాల పరిశీలన అక్టోబర్ 22న జరుగుతుందని, ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24 అని వెల్లడించారు. జూన్‌లో BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరిగిన అత్యంత కీలకమైన ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుందని వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక 1950 హెల్ప్‌లైన్ , జాతీయ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ప్రకటించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : మూడో రోజు 13 నామినేషన్లు దాఖలు
October 15, 2025
0
Tags