సోషల్ మీడియాలో తనను కొంతమంది టార్గెట్ చేశారు : మంత్రి వివేక్ వెంకటస్వామి

Telugu Lo Computer
0


సోషల్ మీడియాలో తనను కొంతమంది టార్గెట్ చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిగా తాను ఎంతో కష్టపడి పని చేస్తునప్పటికీ కులం ఆధారంగా కుట్రలు, విమర్శలు చేస్తున్నారని వాపోయారు. నిజామాబాద్‌లో ఇవాళ మాలల ఐక్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని ప్రసంగించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ని కొంతమంది రెచ్చగొట్టి తనపై విమర్శలు చేయించారని ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే తనకు మంచిపేరు వస్తుందని కొంతమంది విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనపై లక్ష్మణ్ ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ సమావేశానికి లక్ష్మణ్ వచ్చినప్పుడు తాను వెళ్లిపోతున్నానని అనటం అబద్ధమని పేర్కొన్నారు. తాను మాల జాతి అని లక్ష్మణ్ విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనకు మంత్రి పదవిపై మోజు లేదని స్పష్టం చేశారు. లక్ష్మణ్‌ని రాజకీయంగా ప్రోత్సహించింది తన తండ్రి కాకా వెంకటస్వామినే అనే విషయం మర్చిపోతున్నారని తెలిపారు. తనమీద ఎందుకు ఇంత ఈర్ష్య అని, తాను అందరితో కలిసికట్టుగా ఉంటానని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)