మెటా సంస్థ తాజాగా గ్రాడ్యుయేట్లను లక్ష్యంగా చేసుకుని ఎంట్రీ లెవల్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, అర్హత ఉన్న అభ్యర్థులకు మెటా మంచి జీతాలు, స్టాక్ ఆప్షన్లు, ఆరోగ్య ప్రయోజనాలువంటి ఆకర్షణీయమైన ప్యాకేజ్‌లను అందిస్తోంది. ఫుల్-స్టాక్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్,ప్రొడక్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లాంటి ఉద్యోగాల కోసం అభ్యర్థులను నియమిస్తోంది. ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా అప్లైడ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ సమయంలో లేదా తరువాత సంబంధిత యూనివర్సిటీ కోర్సు, ఇంటర్న్‌షిప్, థీసిస్, PHP, Hack, C++, Python లాంటి లాంగ్వేజెస్‌లో 12 నెలల పని అనుభవం, React వంటి ఫ్రేమ్‌వర్క్‌లో పని చేసిన అనుభవం, లార్జ్ స్కేల్ స్టోరేజ్ సిస్టమ్‌లతో పని చేయగల సామర్థ్యం, iOS సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలకు మాత్రం అభ్యర్థులకు ఒక సంవత్సరం అనుభవం ముఖ్యంగా ఆబ్జెక్ట్-ఒరియెంటెడ్ ప్రోగ్రామింగ్, మల్టీ థ్రెడింగ్, Linux/Unix సిస్టమ్స్‌లో కనీసం ఒకదాన్నైనా కలిగి ఉండాలి. ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం ఈ ఎంట్రీ లెవల్ కు వార్షిక జీతం 176000 డాలర్ల నుంచి 290000 డాలర్ల వరకు ఉంటుంది. జీతంతో పాటు వార్షిక బోనస్‌లు, స్టాక్ ఈక్విటీలు, ఆరోగ్య భద్రతా ప్రయోజనాలు, ఇతర కార్మిక సంక్షేమ పథకాలు ఉంటాయి.ఈ ఉద్యోగాలు ఆన్-సైట్ మాత్రమే. వాషింగ్టన్ లేదా కాలిఫోర్నియాలోని మెటా కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. రిమోట్ వర్క్ ఆప్షన్ ఉండదు. ప్రస్తుతం చాలా కంపెనీలు నూతన గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంలో జాప్యం చేస్తుండగా, మెటా మాత్రం యువ ప్రతిభను గుర్తించి, వారిని ఉద్యోగాలలో చేర్చుకోవడంలో చురుకుగా వ్యవహరిస్తోంది. ఆటోమేషన్ పెరుగుతున్న ప్రస్తుత ఉద్యోగ విపణిలో, ఇది ఒక దిగ్గజ కంపెనీ నుంచి వచ్చిన సువర్ణావకాశంగా నిలిచింది.
ఎంట్రీ లెవల్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టిన మెటా సంస్థ !
October 19, 2025
0
Tags