ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ యాజమాన్యాలతో జేఏసీ నాయకులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో, పోరుబాటలో ఉద్యమానికి విద్యుత్ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. 13వ తేదీన ఛలో విజయవాడ, 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే, సంవత్సరం నుంచి సాగుతున్న చర్చలు ఫలితం లేకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. యాజమాన్యం కాలయాపన చేస్తోందని, సమస్యల పరిష్కారం వైపు రావడం లేదని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.. మొండి వైఖరి ఆపాలి.. ఛలో విజయవాడ సమ్మె విద్యుత్ ఉద్యోగులు తప్పదంటున్నారు. కారుణ్య నియామకాలు, కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్, ఎనర్జీ అసిస్టెంట్, డీఏ పెంపు లాంటి కీలక డిమాండ్లు ఉన్నాయి.. గత చర్చల్లో ఇచ్చిన హామీలను ఆర్డర్ రూపంలో ఇవ్వలేదని అంటున్నారు జేఏసీ నేతలు.. 50 వేల కుటుంబాలు రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి వచ్చింది.. 45 రోజులుగా ఆందోళనలో 27 వేల కాంట్రాక్ట్, 35 వేల పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు.. యాజమాన్యం చర్చల పేరుతో సమయం వృథా చేస్తుందని జేఏసీ నేతలు మండిపడుతున్నారు.. ఎనర్జీ సెక్రటరీ స్వయంగా చర్చలకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.. కాంట్రాక్ట్ కార్మికులు 25 ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తెలంగాణలో పర్మినెంట్ చేసినట్టే ఏపీలోనూ చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మూడేళ్లు పనిచేసిన వారిని పర్మినెంట్ చేయాలని.. నారా లోకేష్, పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
విద్యుత్ యాజమాన్యాలతో జేఏసీ చర్చలు విఫలం
October 08, 2025
0
Tags