ఎత్తు తక్కువ ఉన్నాడని బావను హత్య చేసిన బావమరిది

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో  చెల్లి తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నదని సొంత బావపై పగబట్టాడు ఒక యువకుడు.  చెల్లి పెళ్లి చేసుకున్నప్పటినుంచి పై పగబట్టాడు ఒక యువకుడు.  చెల్లి పెళ్లి చేసుకున్నప్పటినుంచి బావను చపుతానంటూ బెదిరించేవాడు. చివరకు అనుకున్నంత పని చేశాడు.  బావను నడిరోడ్డుపై అత్యంత దారుణంగా హత్యచేశాడు బావమరిది. దీంతో కసాయి బావమరిదిపై మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎత్తు తక్కువ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కారణంతో నడి రోడ్డు చెల్లి భర్తను పొడిచి చంపాడని మృతుడి బంధువులు చెబుతున్నారు.  కుటుంబీకుల కథనం ప్రకారం గణేష్, అంజలీదేవికి పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి చూపుల్లో అమ్మాయి కంటే అబ్బాయి ఎత్తు తక్కువగా ఉన్నాడని ఆమె తల్లిదండ్రులు తిరస్కరించారు. కానీ ఆ అమ్మాయి అతనే కావాలని పెళ్లి చేసుకుంది. దీంతో పగబట్టిన ఆమె అన్న దుర్గారావు అప్పటి నుంచి అతన్ని చంపుతానని బెదిరించేవాడని, చివరకు ఈ రోజు గుంటూరులో నడి రోడ్డుపై గణేష్ ను కత్తితో పొడిచి చంపాడు దుర్గారావు. గణేష్‌ని పొడుస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు సెల్ ఫోన్ లో ద్వారా వీడియో తీశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)