మహిళా జర్నలిస్టుల్ని అనుమతించకపోవడం సాంకేతిక సమస్య : తాలిబాన్ మంత్రి ముత్తఖీ

Telugu Lo Computer
0


ఢిల్లీలోని ఆప్ఘనిస్తాన్ ఎంబసీలో రెండు రోజుల క్రితం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మహిళా జర్నలిస్టులు రానివ్వకుండా అడ్డుకున్న ఘటనపై తాలిబాన్ మంత్రి ముత్తఖీ స్పందించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ విషయానికొస్తే, ఇది స్వల్ప నోటీసులో జరిగిందన్నారు. ఎంపిక చేసిన జర్నలిస్టులను మాత్రమే అనుమతించినట్లు ఆయన పేర్కొన్నారు. అనుమతించే జర్నలిస్టుల జాబితా చాలా నిర్దిష్టంగా ఉందన్నారు. మహిళా జర్నలిస్టుల్ని అనుమతించకపోవడం సాంకేతిక సమస్య అని, తమ సహోద్యోగులు జర్నలిస్టుల నిర్దిష్ట జాబితాకు ఆహ్వానం పంపాలని నిర్ణయించుకున్నారని, ఇది తప్ప వేరే ఉద్దేశ్యం లేదని తాలిబాన్ మంత్రి ముత్తాకీ చెప్పారు. దీంతో ఆప్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వ విధానాల ఆధారంగా వారి రాయబార కార్యాలయం కూడా పురుష జర్నలిస్టుల్ని మాత్రమే ఎంపిక చేసి మంత్రి ప్రెస్ మీట్ కు పిలిచినట్లు తేలిపోయింది. వాస్తవానికి రాయబార కార్యాలయాల్లోకి ఎవరిని అనుమతించాలి, ఎవరిని ఆపాలన్న దానిపై నిర్దిష్టమైన నిబంధనలే ఉన్నాయి. ఇవి ఆయా దేశాల విధానాల ఆధారంగా మాత్రమే ఉంటుంది. ఈ విషయంలో కేంద్రం ప్రమేయం కూడా ఉండదు. దీంతో కేంద్రం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకునే పరిస్ధితి లేకుండా పోతోంది. అయితే కనీసం ఈ విషయంలో నిరసన వ్యక్తం చేయకుండా మౌనంగా ఉండటంపై కేంద్రంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)