క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా స్మృతి మంధన !

Telugu Lo Computer
0


హిళల వన్డే క్రికెట్‌ చరిత్రలో ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధన ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వన్డే వరల్డ్‌కప్‌ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఈరోజు జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. ఎవరూ సాధించని ఈ ఘనతను మంధన భారీ సిక్సర్‌తో చేరుకోవడం మరో విశేషం. వన్డేల్లో ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు (2025లో 18 ఇన్నింగ్స్‌ల్లో 1000* పరుగులు) చేసిన బ్యాటర్ల జాబితాలో మంధన తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్‌ (1997లో 970 పరుగులు), లారా వోల్వార్డ్ట్‌ (2022లో 882 పరుగులు), న్యూజిలాండ్‌కు చెందిన డెబ్బీ హాక్లీ (1997లో 880), న్యూజిలాండ్‌కు చెందిన యామీ సాటర్థ్‌వైట్‌ (2016లో 853) ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)