తుర్కిమిస్తాన్ దేశానికి భారత రాయబారిగా బండారు విల్సన్‌ను ప్రభుత్వం నియమించింది. విల్సన్‌ది ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలోని ఇంకొల్లు మండలం ఇడుపులపాడు గ్రామం. ఇండియన్ ఫారిన్ సర్వీస్ కు చెందిన విల్సన్ 2004 బ్యాచ్ అధికారి. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని స్వీకరించారు. యూపీఎస్సీలో ఎంపికైన తర్వాత బండారు విల్సన్ భారత విదేశాంగ సేవలో చేరారు. ఇంతకు ముందు వరకు ఆయన మడగాస్కర్ దేశంలో భారత రాయబారిగా విశిష్టంగా సేవలందించారు. ఆ దేశంలో ఉన్న భారతీయ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చి, భారత్-మడగాస్కర్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసినందుకు ప్రశంసలు పొందారు. తన క్రమశిక్షణ, స్పష్టమైన దౌత్యపర దృష్టికోణం కారణంగా ఆయనను తుర్కిమిస్తాన్ భారత రాయబారిగా నియామకం జరిగింది. విల్సన్ తల్లిదండ్రులు బండారు కృపారావు, ప్రిస్కెల్లా. వీరిద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో పనిచేశారు. వారిద్దరి మార్గదర్శకత్వం, విద్యాపట్ల ఆసక్తి, క్రమశిక్షణ విల్సన్ విజయానికి ప్రేరణగా నిలిచాయి. విల్సన్ ప్రాథమిక విద్యను స్వగ్రామమైన ఇడుపులపాడు విద్యాపరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. 1995-96 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన అనంతరం.. ఉన్నత విద్యను కొనసాగించి, భారత అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 2004లో 272వ ర్యాంకు సాధించారు.
తుర్కిమిస్తాన్ రాయబారిగా బండారు విల్సన్ నియామకం
October 09, 2025
0
Tags