సరస్వతి సిమెంట్స్ షేర్లపై విజయమ్మకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన చెన్నై ఎన్సీఎల్టీ బెంచ్

Telugu Lo Computer
0


రస్వతి సిమెంట్స్ షేర్లపై చెన్నై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ బెంచ్ విజయమ్మకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సరస్వతి సిమెంట్స్ షేర్లపై జూలై 29 న ఎన్సీఎల్టీ  హైదరాబాద్ బెంచ్ జగన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ చెన్నై బెంచ్ లో విజయమ్మ అప్పీల్ దాఖలు చేయగా నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా విజయమ్మకు చెందిన పూర్తి షేర్స్ పై యధాతథాస్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గతంలో వైఎస్ షర్మిల పేరు మీద తల్లి వైఎస్ విజయమ్మ అక్రమంగా షేర్లను బదిలీ చేశారని జగన్ ఆరోపించారు. ఆ షేర్ల బదలాయింపును వెంటనే రద్దు చేయాలంటూ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పిటిషన్ పై 2025 జూలై 15న విచారణ చేపట్టిన ట్రిబ్యూనల్ తీర్పును జులై 29కి రిజర్వ్ చేసింది. షర్మిల, విజయమ్మ సర్వస్వతీ షేర్లను బదిలీ చేయడం అక్రమమేనని, షేర్ల బదిలీని వెంటనే నిలిపివేయాలని ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసింది. నేడు విచారణ చేపట్టి జస్టిస్ ఎన్ శేషసాయి, టెక్నికల్ సభ్యుడు జతీంద్రనాథ్ లతో కూడిన ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది. విజయమ్మ తరఫు న్యాయవాది మాట్లాడుతూ షేర్ల బదిలీ పూర్తిగా చట్టపరమైనదిగా జరిగిందని పేర్కొన్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)