దీపావళిని అధికారిక సెలవు దినంగా ప్రకటించిన కాలిఫోర్నియా !

Telugu Lo Computer
0


మెరికా లోని కాలిఫోర్నియా రాష్ట్రం దీపావళి పండుగను అధికారిక సెలవు దినంగా గుర్తిస్తూ గవర్నర్ గావిన్ న్యూసమ్ అక్టోబర్ 6వ తేదీన కొత్త బిల్లుపై సంతకం చేశారు. ఈ చారిత్రక నిర్ణయాన్ని ఇండియన్-అమెరికన్ వర్గాలు, శాసన సభ్యులు ఘనంగా స్వాగతిస్తున్నారు. ఈ కొత్త చట్టం ప్రకారం దీపావళి పండుగ రోజున పబ్లిక్ స్కూళ్లు, కమ్యూనిటీ కాలేజీలు సెలవు ప్రకటించుకునేందుకు వీలు కలుగుతుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పండుగను పురస్కరించుకుని.. జీతంతో కూడిన సెలవు తీసుకునే వెసులుబాటు లభిస్తుంది. దీపావళి పండుగను అమెరికాలో సెలవు రోజుగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ.. గతంలో ఆ దేశ కాంగ్రెస్‌లో ఓ బిల్లును తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దాన్ని కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లుకు అసెంబ్లీ సభ్యులు దర్శన పటేల్, ఆష్ కల్రా సహ-స్పాన్సర్‌లుగా వ్యవహరించారు. అయితే వీరిద్దరూ కలిసి ప్రవేశపెట్టిన బిల్లుపై తాను సంతకం చేశానని న్యూసమ్ పేర్కొన్నారు. కాలిఫోర్నియా ఈ గుర్తింపును సాధించిన వెస్ట్ కోస్ట్‌లోని మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది. అలాగే భారతీయ పర్వదినానికి ఈరకమైన గుర్తింపు ఇచ్చిన మూడో రాష్ట్రంగా కాలిఫోర్నియా రికార్డు సాధించింది. గతంలోనే పెన్సిల్వేనియా, న్యూయార్క్ వంటి రాష్ట్రాలు ఇలాంటి చర్యలు తీసుకున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)