ఆఫ్ఘనిస్తాన్ ''భారతదేశ ప్రాక్సీ''గా మారిందని, భారత్, నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ తో కలిసి పాకిస్తాన్‌పై కుట్ర చేస్తోందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆరోపించారు. ''ఇప్పుడు భారతదేశం ఒడిలో కూర్చుని పాకిస్తాన్‌పై కుట్రలు పన్నుతున్న కాబూల్ పాలకులు ఒకప్పుడు మన రక్షణలో ఉన్నారు, మన భూమిపై దాక్కున్నారు'' అని ఆయన అన్నారు. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ ఇటీవల భారతదేశ పర్యటన తర్వాత పాక్ రక్షణ మంత్రి నుంచి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వచ్చాయి. ''పాకిస్తాన్ గడ్డపై నివసిస్తున్న ఆఫ్ఘాన్లు వారి స్వదేశానికి వెళ్లాలి. వారికి కాబూల్ లో సొంత ప్రభుత్వం ఉంది. మన భూమి, వనరులు 250 మిలియన్ల పాకిస్తానీయులకు చెందినవి.'' అని ఆయన అన్నారు. కాబూల్ నుంచి దురాక్రమణలు ఎదురైతే పాకిస్తాన్ అందుకు సిద్ధంగా ఉందని, తనను తాను రక్షించుకునే సామర్థ్యం ఉందని ఆసిఫ్ అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ ''భారతదేశ ప్రాక్సీ''గా మారింది : పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్
October 18, 2025
0
Tags