హెలి టూరిజానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం !

Telugu Lo Computer
0


తెలంగాణ ప్రభుత్వం హెలి టూరిజానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వరకు హెలికాప్టర్‌ సర్వీసులు ప్రారంభించేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన హెలికాప్టర్‌ నల్లమల అడవులు, సోమశిల, అమరగిరి వంటి ప్రాంతాల అందాలను పై నుంచి చూపిస్తూ శ్రీశైలం చేరుకునేలా రూట్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో ఉన్నందున, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి శ్రీశైలానికి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ఐదు నుంచి ఆరు గంటలు పడుతోంది. అయితే హెలికాప్టర్‌ ద్వారా ప్రయాణిస్తే కేవలం గంటలోపే గమ్యం చేరుకోవచ్చు. ఈ హెలీ టూరిజంలో భాగంగా ఒక్కో హెలికాప్టర్ లో ఆరు నుంచి ఎనిమిది మంది ప్రయాణించే సీటింగ్‌ సామర్థ్యం ఉంటుంది. పర్యాటక శాఖ ఈ టూర్‌ను రెండు నుంచి మూడు రోజుల ప్యాకేజీ రూపంలో రూపొందిస్తోంది. ఇందులో ప్రయాణం, దర్శనం, వసతి వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి. త్వరలోనే బుకింగ్‌ల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. తొలి విడత సక్సెజ్ అయితే, రెండో దశలో వరంగల్‌, ములుగు జిల్లాల్లోని రామప్ప ఆలయం, లక్నవరం సరస్సు వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు కూడా హెలికాప్టర్‌ సర్వీసులను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)