ఈ - కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఆపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ 16 ప్రోపై బంపర్ ఆఫర్ ప్రకటించాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయినప్పటికీ స్మార్ట్ ఫోన్ లవర్స్ మాత్రం ఐఫోన్ 16 ప్రో వైపే మొగ్గు చూపుతున్నారు. దీనికి ఇంకా పోటీ తగ్గలేదు సరికదా, డిమాండ్ పెరిగిపోతోంది.6.3 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ల్పే ఉన్న ఐఫోన్ 16 ప్రో, ప్రో మోషన్ టెక్నాలజీ ద్వారా 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేటుతో విజువల్స్‌ను అందిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ : ధర: ₹1,19,900 నుండి తగ్గింపు ధర ₹1,04,999. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డుపై అదనంగా ₹4,000 తగ్గింపు, పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే ₹61,900 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది.
బిగ్‌బాస్కెట్ : 128GB వేరియంట్ ₹99,990 ధరకే లభిస్తోంది. ఈ లిస్ట్‌లో ఉన్న అత్యంత బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ ఇదే.
క్రోమా : 256GB వేరియంట్ ధర ₹1,13,490, నమ్మకమైన రిటైల్ అనుభవం కోసం చూసేవారికి ఇది మంచి ఎంపిక.
విజయ్ సేల్స్ : 256GB మోడల్ ధర ₹1,14,900. EMI రహిత ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు చెల్లింపులపై తక్షణమే ₹5,000 డిస్కౌంట్ లభిస్తుంది.
రిలయన్స్ డిజిటల్ : 256GB వేరియంట్ ధర ₹1,19,900.