కేరళలో శరత్ నాయర్ అనే చిరుద్యోగి ఓనం బంపర్ లాటరీలో రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. శరత్ నాయర్ స్వస్థలం అలప్పుజలోని తురవూర్. గత 12 సంవత్సరాలుగా అతడు ఓ పెయింట్ల దుకాణంలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం అతడు కేరళ రాష్ట్ర లాటరీల శాఖ నిర్వహించే ఓనం బంపర్ లాటరీలో టీహెచ్ 577825 నంబరు టికెట్టు కొనుగోలు చేశాడు. ఈ లాటరీకి సంబంధించి తాజాగా వెల్లడించిన ఫలితాల్లో శరత్ నాయర్ కొనుగోలు చేసిన టికెట్ బపర్ లాటరీ గెలిచినట్లు తెలిసింది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ నేను చాలా అరుదుగా లాటరీ టికెట్లు కొంటుంటాను. అయితే మెగా బంపర్ లాటరీ కోసం ఇలా టికెట్ కొనడం ఇదే మొదటిసారి. నేను కొన్న టికెట్‌కే లాటరీ తగిలిందని తెలిసి మొదట నేను ఆశ్చర్యపోయాను. నిజంగా లాటరీ తగిలింది నాకేనా కాదా అని తెలుసుకోవడం కోసం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాను. నిజంగా నేను కొన్న టికెట్‌కే లాటరీ తగిలిందని తెలిసి చాలా సంతోషపడ్డాను అని చెప్పకొచ్చారు. నేను ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న లాటరీ టికెట్‌ని స్థానికంగా ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌లో సమర్పించాను. లాటరీలో నేను రూ.25 కోట్ల రూపాయలు గెలిచాను. ఈ మొత్తం డబ్బుతో ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. ముందుగా నాకున్న అప్పులు తీర్చేసి, ఆ తర్వాత ఏం చేయాలి అనే దానిపై కుటుంబ సభ్యలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను అని తెలిపారు. శరత్ కుమార్ గెలిచిన 25 కోట్ల రూపాయల లాటరీ టికెట్ మొత్తంలో 30 శాతం ఆదాయపు పన్ను కట్ అవుతుంది. అలానే ఏజెంట్ కమిషనర్‌కి 10 శాతం అంటే రూ.2.5 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం పోగా శరత్ కుమార్‌కి రూ.15.75 కోట్లు అందే అవకాశం ఉంది.
కేరళలో ఓనం బంపర్ లాటరీ చిరుద్యోగి !
October 07, 2025
0
Tags