సిట్రోయెన్ ఇండియా 'ఎయిర్‌క్రాస్ ఎక్స్' కారు లాంచ్ : బుకింగ్స్ ప్రారంభం

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లో సిట్రోయెన్ ఇండియా 'ఎయిర్‌క్రాస్ ఎక్స్' లాంచ్ చేసింది. ఈ కారు ధరలు రూ. 8.29 లక్షల నుంచి ప్రారంభమై రూ. 13.69 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. కంపెనీ ఈ లేటెస్ట్ మోడల్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. కొత్త డీప్ ఫారెస్ట్ గ్రీన్ రంగులో కనిపించే ఈ కొత్త సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్ ఎంట్రీ & పుష్ స్టార్ట్ బటన్, క్రూయిజ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్, ఆటో ఐఆర్వీఎం, ఎల్ఈడీ ప్రొజెక్టర్ ఫాగ్ లాంప్స్, వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా వంటి వాటితో పాటు 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 7 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ కూడా పొందుతుంది. లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ ఫ్రెంచ్ బ్రాండ్ కారు. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇందులో ఆరు ఎయిర్‌ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. కొత్త సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్ 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ & 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. మొదటి ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఎంపికను మాత్రమే పొందుతుంది. రెండోది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను పొందుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)