హైదరాబాద్ లో గూగుల్ ఆఫీస్ లో దీపావళి సెలబ్రేషన్స్ అంబరాన్ని తాకుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 'గూగుల్ ఆఫీస్ హైదరాబాద్ లో దివాళి పార్టీ' అనే పేరుతో ఈ పోస్టు పెట్టారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 1 లక్షా 22 వేల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఏ ఉద్యోగికి అయినా ఇది ఒక డ్రీమ్ వర్క్ అని ఒకరు కామెంట్ పెట్టారు. నేను నోయిడాలో ఉంటాను. కానీ అక్కడికీ ఇక్కడికీ వర్క్ కల్చర్ లో చాలా తేడాలు ఉన్నాయని మరొకరు కామెంట్ పెట్టారు. మరో యూజర్ నేను లే ఆఫ్ లో భాగంగా బయటకు వచ్చాను. ఎక్కడకు వెళ్లాలి అని కామెంట్ చేశారు. దీపావళి సందర్భంగా ఆఫీస్ లో ఉద్యోగుల ఎనర్జీ, క్రియేటివిటీకి ఈ వీడియో నిదర్శనంగా ఉంది. ఈ పండుగలో ఉద్యోగులు సంపూర్ణంగా పాల్గొన్నారు. ఆఫీన్ ను కళ్లు చెదిరే లైట్స్ తో అలంకరించారు. రంగోలీలు వేశారు. ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. గేమ్స్ అండ్ పెయింటింగ్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. బెంగళూరులో గూగుల్ ఆఫీస్ ఫుడ్ ప్యారడైజ్ గా మారింది. ల్యావిష్ బఫెట్ ను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, బెంగళూరు గూగుల్ ఆఫీస్ లో దివాళి పార్టీ : వీడియో వైరల్
October 19, 2025
0
Tags