అమెరికా లోని డెలాండ్, సౌత్‌వెస్టర్న్ మిడిల్ స్కూల్‌లో చదువుతున్న 13 ఏళ్ల బాలుడు తనకు స్కూల్ ఇచ్చిన ల్యాప్‌టాప్‌లో 'How to kill my friend in the middle of class' అని చాట్‌జీపీని సలహా అడిగాడు. అయితే స్కూల్ ల్యాప్‌టాల్‌ని Gaggle అనే AI మానిటరింగ్ సిస్టమ్ ఈ మెసేజ్‌ను ఫ్లాగ్ చేసింది. ఇది విద్యార్థుల ఆన్‌లైన్ యాక్టివిటీని ట్రాక్ చేసి, హింస, సెల్ఫ్-హార్మ్ వంటి కంటెంట్‌ను గుర్తిస్తుంది. దీంతో అది వెంటనే స్కూల్ రిసోర్స్ డెప్యూటీకి అలర్ట్ ఇచ్చింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఎందుకు చేశామని పోలీసులు బాలుడిని ప్రశ్నించగా ఫ్రెండ్ తనను ఊరికే ఎడిపిస్తున్నాడని, అందుకోసమే అతన్ని ఆటపట్టించాలని కేవలం ట్రోల్ చేస్తున్నానని' ఆ యువకుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. కానీ అధికారులు దీన్ని జోక్‌గా తీసుకోలేదు, ముఖ్యంగా ఫ్లోరిడాలో 2018 పార్క్‌ల్యాండ్ స్కూల్ షూటింగ్ వంటి ఘటనలు గుర్తులో ఉండటంతో పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనపై వోలుసియా కౌంటీ షెరీఫ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, మీ పిల్లలతో మాట్లాడండి, ఇలాంటి తప్పులు చేయకూడదు అని హెచ్చరించారు.
స్నేహితుడిని క్లాస్ మధ్యలో ఎలా చంపాలి అని చాట్‌జీపీటిని అడిగిన విద్యార్థి : క్షణాల్లో ఇంటికొచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు
October 08, 2025
0
Tags