ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సర్వవాడ శ్రీ వెంకమాంబ దేవస్థానం ఆలయంలో ప్రధాన అర్చకునిగా సురేష్ ఉన్నారు. విజయదశమి పండుగ కావడంతో, ఆయన ఉదయం నుంచే ప్రత్యేక పూజల్లో లీనమయ్యారు. పట్టు వస్త్రాలు ధరించి, ఎంతో భక్తితో అమ్మవారికి హారతి ఇస్తూ, తీర్థప్రసాదాలను భక్తులకు పంచుతున్నారు. అయితే భక్తులకు ప్రసాదం అందిస్తుండగానే, సురేష్ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. క్షణాల్లో జరిగిన ఈ ఊహించని పరిణామంతో ఆలయంలోని భక్తులు, ఇతర సిబ్బంది దిగ్భ్రాంతికి లోనయ్యారు. భక్తి నిండిన ఆలయం ఒక్కసారిగా శోక సంద్రంగా మారింది. సురేష్ స్వామి పడిపోవడంతో ఆలయంలో గందరగోళం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన భక్తులు, ఆలయ సిబ్బంది ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించడంతో కుటుంబ సభ్యులు, ఆలయ సిబ్బంది కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఆలయంలో భక్తులకు ప్రసాదం అందిస్తుండగా కుప్పకూలిన అర్చకుడు !
October 02, 2025
0
Tags