ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ వాళ్లకి రూ.22,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చిందని, రాష్ట్ర జీఎస్టీలో 100 శాతం రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారని, గూగుల్ కు కేటాయించిన భూమి 25 శాతం డిస్కౌంట్‌తో ఇస్తున్నారని, నీళ్లపై టారిఫ్‌లో కూడా 25శాతం డిస్కౌంట్ ఇచ్చారని కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. ట్రాన్స్‌మిషన్ 100 శాతం ఉచితంగా కల్పించనున్నారని వెల్లడించారు. ఇవన్నీ వాళ్లు చెప్పరు, గూగుల్ వచ్చింది అని మాత్రమే పత్రికల్లో రాస్తారని ఖర్గే వ్యాఖ్యానించారు. అన్ని రాయితీలు తాము ఇస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని అంటారు అన్నారు. బెంగళూరులో జనావాసం ఎక్కువ అవుతుందని అంటున్నారని, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తే జనావాసం ఎక్కువ అవుతుంది కదా అని వ్యాఖ్యానించారు. మరోవైపు వైజాగ్ కు గూగుల్ డేటా సెంటర్ రాకపై ఇతర రాష్ట్రాల్లో అప్పుడే మంట మొదలైనట్లు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు. ఆంధ్రా ఆహారం కారంగా ఉంటుందని అంటున్నారని, తమ పెట్టుబడులు కూడా అలాగే అనిపిస్తున్నాయని లోకేష్ ట్వీట్ చేశారు. కొంతమంది పొరుగువారు ఇప్పటికే దాని భారాన్ని అనుభవిస్తున్నారన్నారు.
గూగుల్ కి అన్ని ప్రోత్సాహకాలు ఇస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది !
October 17, 2025
0
Tags