పపువా న్యూ గినియాలో భూకంపం : రిక్టర్ స్కేల్ పై 6.7 గా నమోదు

Telugu Lo Computer
0


పువా న్యూ గినియాలోని తూర్పు న్యూ గినియా ప్రాంతంలో 6.7 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం మొత్తం ఆ ప్రాంతాన్ని కుదిపేసింది. యూరో-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ నివేదికల ప్రకారం.. స్థానిక సమయం 11:05కి భూకంపం వచ్చింది. భూమికి కేవలం 10 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉందని నివేదికలు స్పష్టం చేశాయి. భూకంప కేంద్రం మొరోబ్ ప్రావిన్స్ రాజధాని లోయ్‌కి పశ్చిమాన 19 కిలోమీటర్ల దూరంలో ఉందని నివేదికలు తెలిపాయి. ఈ ప్రాంతం దేశంలోనే రెండవ అతిపెద్ద నగరం. ఇక్కడ దాదాపు 76,000 జనాభా నివసిస్తున్నారు. ఈ భూకంపం కారణంగా స్థానిక నివాసితులు భయంతో తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రాంతం మళ్లీ కూడా ప్రకంపనలకు గురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)