ఫ్లిప్ కార్ట్ లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ పై డిస్కౌంట్ ఆఫర్ !

Telugu Lo Computer
0


ఫ్లిప్ కార్ట్  మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ పై డిస్కౌంట్ ప్రకటించింది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 25,999లకి లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత దీనిని కేవలం రూ.18,999 కి కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై రూ. 1000 వరకు మరింత తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ ఫోన్ ను 17,999లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే రూ.14,260 ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ను కూడా వినియోగించుకుంటే దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఇది 6.7-అంగుళాల Full HD+ pOLED ఎండ్లెస్ ఎడ్జ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంది. డిస్ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అందించారు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7s Gen 2 5G చిప్సెట్ ప్రాసెసర్ ఉంది. కెమెరా  OIS సపోర్ట్ తో 50MP సోనీ LYTIA 700C ప్రైమరీ కెమెరా, మాక్రో విజన్ సపోర్ట్ తో 13MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఇది 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ తో వస్తుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ సిమ్ (నానో-సిమ్ + ఈ-సిమ్) వంటి ఫీచర్లున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)