మూడో లైన్‌ మరమ్మతులు పనుల నిమిత్తం 32 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే !

Telugu Lo Computer
0


డోర్నకల్‌-పాపటపల్లి మార్గంలో మూడో లైన్‌ మరమ్మతులు పనులు చేపడుతున్న నేపథ్యంలో వారం రోజుల పాటు 32 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో పాటు రీషెడ్యూల్‌ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్, స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్‌సిటీ, పూరి-ఓకా ద్వారకా ఎక్స్‌ప్రెస్‌, డోర్నకల్-కాజీపేట, విజయవాడ-డోర్నకల్ మధ్య నడిచే మెమో ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు చెప్పారు. అలాగే, పలు ప్రధాన రైళ్లను అధికారులు రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఈ నెల13, 16, 17 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా బయలుదేరుతుందని చెప్పారు. విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు 15, 16, 18 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా వెళ్తుందని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 14 నుంచి 18 వరకు కాజీపేట-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశామని, ఈ రైలు కేవలం సికింద్రాబాద్-కాజీపేట మధ్య మాత్రమే రాకపోకలు సాగిస్తుందని అధికారులు వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)