ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం : 20 అంశాలపై చర్చించి వాటికి ఆమోదం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రెండున్నర గంటల పాటు జరిగింది. దీనిలో 20 అంశాలపై చర్చించి వాటికి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.15 వేలు ఇచ్చే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే  పలు సంస్థలకు భూములు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్నికల్‌ హబ్స్‌ 2024-29కి ఆమోదం, జల వనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.15 వేలు ఇచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కారవాన్‌ పర్యాటకానికి, అమృత్‌ 2.0 పథకం పనులకు సంబంధించి ఆమోదం తెలిపింది. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి ఎస్‌పీవీ ఏర్పాటుకు, రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలకు భూకేటాయింపులకు, కుష్టు వ్యాధి పదం తొలగించే చట్ట సవరణ ప్రతిపాదనకు, విద్యుత్‌ శాఖకు సంబంధించి పలు పనులకు, కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)