19 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్న మంత్రి నారా లోకేష్ !

Telugu Lo Computer
0


స్ట్రేలియా ప్రభుత్వం నిర్వహించే 'స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్'లో పాల్గొనాలని మంత్రికి హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన పత్రం పంపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నుకోబడిన ప్రముఖ నాయకులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మానవ వనరులు, సాంకేతికత, ఆర్థికాభివృద్ధి రంగాల్లో తీసుకుంటున్న ఆధునిక విధానాలను అభినందిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఆహ్వానం అందించింది. రాష్ట్రంలో డిజిటల్ విద్య, నైపుణ్యాభివృద్ధి, ఐటీ పెట్టుబడులు, ఇన్నోవేషన్ విధానాలపై లోకేష్ చూపుతున్న దృష్టి ఆస్ట్రేలియా అధికారులను ఆకట్టుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఆస్ట్రేలియాతో విద్యా మరియు పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే వేదికగా ఈ పర్యటన కీలకంగా మారనుంది. ఈ పర్యటనలో లోకేష్ ఆస్ట్రేలియాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలను సందర్శించనున్నారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, గ్రిఫిత్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ వంటి విద్యాసంస్థల్లో ఆయన ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. అధునాతన విద్యావిధానాలు, నైపుణ్య శిక్షణ పద్ధతులు, పరిశోధనా విధానాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయనున్నారు. పర్యటనలో భాగంగా లోకేష్ నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ 2025ను విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో ఆస్ట్రేలియాలో రోడ్ షోల్లో పాల్గొననున్నారు. ఆయన ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశమై ఐటీ, విద్యా, రవాణా, మౌలిక సదుపాయ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)