శాంసంగ్ గెలాక్సీ ఎం17 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల !

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. గెలాక్సీ ఎం17 5జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. రెండు కలర్ ఆప్షన్‌లలో లభించే ఈ ఫోన్, ఓఐఎస్‌తో 50MP ప్రైమరీ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 5MP అల్ట్రావైడ్, 2MP మాక్రో లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. M16 5G కంటే ఇది వేగవంతమైన ప్రాసెసర్, పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499. 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.13,999, రూ.15,499. లాంచ్ ఆఫర్ లో భాగంగా కస్టమర్లు 4 జీబీ వేరియంట్‌ను రూ.11,999లకు 6 జీబీ వేరియంట్‌ను రూ.13,499 లకు, 8 జీబీ వేరియంట్‌ను రూ.14,999 ధరకు అమెజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత వన్‌ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టమ్, 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్‌ అమోల్డ్‌, 1,100 నిట్స్‌ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, ఎక్సినోస్‌ 1330 చిప్‌సెట్, 4GB/6GB/8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ (మైక్రో ఎస్‌డీ ద్వారా విస్తరించవచ్చు), 50MP (ఓఐఎస్‌) + 5MP (అల్ట్రా వైడ్‌) + 2MP (మాక్రో), ఫ్రంట్ 13MP సెల్ఫీ కెమెరా (వాటర్‌డ్రాప్ నాచ్‌లో), 5,000mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్, సెక్యూరిటీ & అప్డేట్స్: 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌, 6 ఓఎస్‌ అప్‌గ్రేడ్స్ హామీతో వచ్చింది. 


Post a Comment

0Comments

Post a Comment (0)