ఇన్ స్టాగ్రామ్ లో టీనేజర్లు డీఫాల్ట్ గా పీజీ 13 కంటెంట్ మాత్రమే చూసేలా మార్పులు !

Telugu Lo Computer
0


న్ స్టాగ్రామ్ టీనేజర్లు డీఫాల్ట్ గా పీజీ 13 కంటెంట్ ( 13 ఏళ్ల వయసు లోపు వాళ్లు చూడగలిగే కంటెంట్, వీడియోలు) మాత్రమే చూసేలా మార్పులు చేసింది. అంతకు మించిన కంటెంట్ చూడాలంటే వారి తల్లితండ్రుల అనుమతి తప్పనిసరి. ఈ మేరకు సెట్టింగ్స్ లో మార్పులు చేస్తున్నారు. ఇందులో సెక్స్, మాదకద్రవ్యాలు లేదా ప్రమాదకరమైన స్టంట్‌లు ఉండవని  ఇన్ స్టాగ్రామ్ తెలిపింది.దారుణమైన భాషతో కూడిన పోస్ట్‌లను వారికి అందుబాటులో లేకుండా చేయడం లేదా రిఫర్ చేయకపోవడం, కొన్ని ప్రమాదకర స్టంట్‌లు, గంజాయి సామగ్రిని చూపించే పోస్ట్‌లు వంటి హానికరమైన ప్రవర్తనలను ప్రోత్సహించే కంటెంట్ ను తప్పించడం వంటివి ఉన్నాయని మెటా తెలిపింది. గత సంవత్సరం టీనేజర్ ఖాతాలను ప్రవేశపెట్టిన తర్వాత ఇదే పెద్ద అప్ డేట్ అని ఇన్ స్టా వెల్లడించింది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏర్పాటు చేయగల మరింత కఠినమైన సెట్టింగ్స్ ను కూడా అందుబాటులోకి తెస్తోంది. పిల్లలకు హాని కలిగించే కంటెంట్ పై నిరంతర విమర్శలను ఎదుర్కొంటున్న ఇన్ స్టా వీటి నియంత్రణలో భాగంగానే ఈ మార్పులు తెచ్చింది. టీనేజర్ల రక్షణ కోసం స్వీయ-హాని, తినే రుగ్మతలు, ఆత్మహత్యల పోస్ట్‌లను చూపించబోమని మెటా ఇప్పటికే హామీ ఇచ్చింది. అయినా ఇప్పటికీ అలాంటి పోస్టులు కనిపిస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెటా తాజా అప్ డేట్ ఇచ్చింది. ఓన్లీఫ్యాన్స్ ఖాతాకు టీనేజర్లు లింక్ అయి ఉంటే, ఇకపై వారు ఈ కంటెంట్‌ను చూడలేరని మెటా పేర్కొంది. అలాగే వారికి మెసేజ్ లు కూడా పంపలేరు, అలాగే ఎవరి పోస్ట్‌ల క్రింద వారి వ్యాఖ్యలను చూడలేరు.

Post a Comment

0Comments

Post a Comment (0)