దీపావళి పండుగ స్పెషల్ గా గూగుల్ ఒక సూపర్ ఆఫర్ తీసుకొచ్చింది. గూగుల్ డ్రైవ్‌లో రూ. 11కే 2TB వరకు స్టోరేజ్ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ ఈ ధర మొదటి మూడు నెలలకే వర్తిస్తుంది. ఆ తర్వాత రెగ్యులర్ రేట్‌కి వెళ్ళిపోతుంది. గూగుల్ ఈ దివాళీకి తీసుకొచ్చిన ప్లాన్‌లు చాలా అఫోర్డబుల్‌గా ఉన్నాయి. మొత్తం నాలుగు ప్లాన్‌లు 30GB, 100GB, 200GB, 2TB ఉన్నాయి. మొదటగా Lite 30GB ప్లాన్ గురించి చెప్పాలంటే, మొదటి మూడు నెలల పాటు కేవలం రూ.11కే దొరుకుతుంది, ఆ తర్వాత ప్రతి నెల రూ. 59 మాత్రమే. చిన్న ఫైల్స్, ఫోటోలు సేవ్ చేసుకునే వారికి ఇది బాగుంటుంది. Basic 100GB ప్లాన్ కూడా ఇదే విధంగా మొదటి మూడు నెలలు రూ. 11కే లభిస్తుంది, ఆ తర్వాత నెలకు రూ. 130. కొంచెం ఎక్కువ డేటా స్టోర్ చేయాలనుకునే వాళ్లకు ఇది సరైన ఆప్షన్. Standard 200GB ప్లాన్ తీసుకుంటే మొదటి మూడు నెలలకి రూ. 11కే, తర్వాత ప్రతి నెల రూ. 210 చెల్లించాలి ఇది పెద్ద సైజ్ ఫోటోలు, వీడియోలు లేదా డాక్యుమెంట్లు స్టోర్ చేసుకునే వాళ్లకు సరిపోతుంది. చివరగా Premium 2TB ప్లాన్ ఉంది, ఇది కూడా మొదటి మూడు నెలలకి రూ. 11కే దొరుకుతుంది, కానీ తర్వాత ప్రతి నెల రూ. 650 అవుతుంది. ఎక్కువ డేటా ఉపయోగించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. వార్షిక ప్లాన్‌ల విషయానికి వస్తే, గూగుల్ చాలా మంచి డిస్కౌంట్లను ఇచ్చింది. చిన్నవారికి సరిపోతే Lite 30GB ప్లాన్ సంవత్సరం పూర్వం రూ. 479కి లభిస్తుంది. కొంచెం ఎక్కువ డేటా కోసం Basic 100GB ప్లాన్ ఉంది, ఇది ఇప్పుడు రూ. 1000కే లభిస్తుంది, అసలు ధర రూ. 1560. మరింత ఎక్కువ డేటా స్టోర్ చేసుకోవాలనుకుంటే స్టాండర్డ్ 200GB ప్లాన్ ఉంది, ఇది రూ. 1600లో లభిస్తుంది, అసలు ధర రూ. 2520. చివరగా, పెద్ద వాడుకరుల కోసం Premium 2TB ప్లాన్ ఉంది, ఇది ఇప్పుడు రూ. 4900కే లభిస్తుంది, అసలు ధర రూ. 7800. ఈ తగ్గింపు ధరలు మీరు సబ్‌స్క్రైబ్ చేసే తేదీ నుండి ఒక సంవత్సరానికి వర్తిస్తాయి, ఆ తరువాత మళ్లీ ప్లాన్‌లకు మామూలు ధర అమలులోకి వస్తుంది.
గూగుల్ డ్రైవ్‌లో రూ. 11కే 2TB స్టోరేజ్ ప్లాన్ !
October 17, 2025
0
Tags