రానుపోను టికెట్ బుకింగ్ పై 10 శాతం రాయితీ ప్రకటించిన టీజీఎస్ఆర్టీసీ

Telugu Lo Computer
0


రానుపోను అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకునే వారికి ప్రయాణ ఛార్జీలో 10 శాతం రాయతీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. రానుపోను ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేసింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం తమ అధికారిక వెబ్ సైట్ https://tsrtconline.in ని సందర్శించాలని సూచించింది. యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నా ఈ 10 శాతం రాయితీ వర్తిస్తుంది. గతంలో కూడా ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం. అప్పట్లో అది పరిమితంగా ఉండేది. హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్- విజయవాడ, హైదరబాద్- తిరుపతి వంటి రద్దీ మార్గాల్లో ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ వల్ల ఆక్యుపెన్సీ రేషియో భారీగా పెరిగింది. ఫలితంగా దీన్ని మరింత విస్తరించింది. ఇటీవలే హైదరాబాద్ - బెంగళూరు మార్గంలో సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణించే వారికి 20 శాతం రాయితీని ప్రకటించిన విషయం తెలిసిందే.


Post a Comment

0Comments

Post a Comment (0)