తొమ్మిది నెలల్లో 1,03,884 కార్లను విక్రయించిన విన్‌ఫాస్ట్ !

Telugu Lo Computer
0


వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 9 నెలల వ్యవధిలోనే లక్షకు పైగా కార్లను విక్రయించి సంచలనం రేపింది. ఒకే ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లోనే ఈ ఘనత సాధించిన తొలి కార్ల బ్రాండ్‌గా నిలిచినట్లు కంపెనీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ నెలలో విన్‌ఫాస్ట్ 13,914 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు అమ్ముడైన మొత్తం కార్ల సంఖ్య 1,03,884కు చేరింది. భారత ఆటోమొబైల్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. గత 11 నెలలుగా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల బ్రాండ్‌గా విన్‌ఫాస్ట్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)