గూగుల్‌ ఫొటోస్‌లో 'Veo3' ఫీచర్‌

Telugu Lo Computer
0


గూగుల్‌ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అధునాతన ఏఐ వీడియో జనరేషన్ టూల్ 'Veo 3'ని ప్రవేశపెడుతూ గూగుల్‌ ఫొటోస్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. దీంతో వినియోగదారులు తమ స్టిల్ ఫొటోలను డైనమిక్‌గా, నాలుగు సెకన్ల వీడియోలుగా మార్చుకోవచ్చు. గూగుల్‌ ఏఐ ప్రో, అల్ట్రా సబ్‌స్క్రైబర్‌లతో పోలిస్తే ఉచిత వినియోగదారులకు పరిమిత సంఖ్యలోనే ఏఐ వీడియోలకు అవకాశం కల్పించింది. ప్రస్తుతానికి ఈ సేవలు అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏఐ వీడియోలు సృష్టించడంతో పాటు ఫొటోలకు మరిన్ని మెరుగులు దిద్దేందుకు గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌ కింది భాగంలో కొత్తగా 'క్రియేట్‌' అనే ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇందులో ఫొటోస్‌ టు వీడియోస్‌, రీమిక్స్‌, కాలేజ్‌, సినిమాటిక్‌ ఫొటోస్‌, హైలైట్‌ వీడియోస్‌, యానిమేషన్స్‌ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. ఫొటోను వీడియోగా మార్చేందుకు 'ఫొటోస్‌ టు వీడియోస్‌' ఆప్షన్‌కు వెళ్లి.. అక్కడ మనకు కావాల్సిన ఫొటోను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మరో రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకటి సటెల్‌ మూవ్‌మెంట్‌, మరొకటి ఐయామ్‌ ఫీలింగ్‌ లక్కీ. సటెల్‌ మూవ్‌మెంట్‌ ద్వారా ఫొటోలను చిన్నపాటి యానిమేషన్‌గా మార్చొచ్చు. ఐయామ్‌ ఫీలింగ్‌ లక్కీ కింద మరిన్ని ఎఫెక్ట్‌లు వస్తాయి. ఇలా రూపొందిన నాలుగు సెకన్ల వీడియోలను సేవ్‌ చేసుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)