దేశీయ మార్కెట్లోకి మోటోరోలా నుండి మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో G36 రాబోతుంది. ఈ ఫోన్ కొన్ని అప్‌గ్రేడ్ ఫీచర్లతో గత సంవత్సరం విడుదలైన మోటో G35కు అప్డేటెడ్ గా రానుంది. ఇది 6.72 అంగుళాల TFT డిస్‌ప్లేను 1,080×2,400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కలిగి ఉంటుందని TENAA లిస్టింగ్ సూచిస్తుంది. ఇది మోటో G35 కంటే పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 2.4GHz బేస్ కోర్ ఫ్రీక్వెన్సీతో ఆక్టా కోర్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 4GB, 8GB, 12GB, 16GB RAM ఆప్షన్లు అలాగే 64GB, 128GB, 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్లు లభించే అవకాశం ఉంది. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు వైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చని అంచనా.. ఇది మోటో G35లో ఉన్న 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కంటే అప్‌గ్రేడ్ చేసింది. 6,790mAh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని మోటోరోలా 7,000mAhగా లాంచ్ చేయవచ్చు. ఇది పెద్ద బ్యాటరీ కావడంతో.. ఇది వినియోగదారులకు ఎక్కువ సేపు ఉపయోగించడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ ఫోన్ పర్పుల్ రంగులో అందుబాటులో ఉంటుంది. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ కొలతలు 166.3×76.5×8.7mm కాగా, 210గ్రాములు ఉండనుంది.
మోటోరోలా నుండి త్వరలో మోటో G36 స్మార్ట్‌ఫోన్ ?
September 17, 2025
0
Tags