డ్రైనేజీలో కొట్టుకుపోయిన మామ, అల్లుడు!

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే దాదాపు 12 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. డ్రైనేజీలో మామ, అల్లుడు కొట్టుకుపోయారు. మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా గల్లంతయ్యాడు. వీరిద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అలాగే, ముషీరాబాద్‌లో ఓ యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. నాలాపై ఉన్న గోడపై కూర్చొని ఉండగా, గోడ కూలడంతో సన్నీ (24) గల్లంతయ్యాడు. మరోవైపు, షేక్‌పేట, రాయదుర్గం, రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, ముషీరాబాద్‌, రామ్‌నగర్‌, తార్నాక, ఎల్బీనగర్‌, కాచిగూడ, కుషాయిగూడ, కాప్రా, కీసర తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వర్షం నీటితో వాహనచోదకులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంజారాహిల్స్‌లో జలమయమైన రహదారులను అధికారులతో కలిసి జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)