ఓటు చోరీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా : ఓటర్ అధికార్ ముగింపు సభలో రాహుల్ గాంధీ

Telugu Lo Computer
0


బీహార్ లో ఓటర్ అధికార్ ర్యాలీని ముగిస్తూ రాహుల్ గాంధీ బీజేపీని హెచ్చరించారు. మేము బీజేపీ రాజ్యాంగాన్ని హత్య చేయనివ్వము. అందుకే యాత్ర చేపట్టాము. ప్రజల నుంచి 'ఓట్ చోర్, గద్ది చోర్' నినాదాలు వచ్చాయని అన్నారు. ''ఓట్ చోర్'' నినాదం ప్రతీ చోటా ధ్వనిస్తోందని, ఇప్పుడు చైనాకు కూడా చేరుకుందని రాహుల్ గాంధీ, ప్రధాని మోడీ చైనా ఎస్‌సీఓ పర్యటనను విమర్శించారు. నేను బీజేపీకి చెబుతున్నా, మీరు అణు బాంబు కన్నా పెద్దది ఏదైనా విన్నారా.? ఇది హైడ్రోజన్ బాంబు. బీజేపీ సిద్ధంగా ఉండాలి, హైడ్రోజన్ బాంబు వస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ''స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్'' ద్వారా బీహార్‌లో ఓటర్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు అధికార బీజేపీ, ఎన్నిక సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. 65 లక్షల మంది ఓటు హక్కును అక్రమంగా తొలగించారంటూ రాహుల్ గాంధీ గతంలో ఆరోపిస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అంతే స్థాయిలో బీజేపీ విరుచుకుపడింది. రాహుల్ గాంధీ కామెంట్స్ తనను తాను కించపరుచుకోవడం, దేశ ఓటర్లను అవమానించడమే అని బీజేపీ ఎదురుదాడి చేసింది. రాహుల్ గాంధీ ర్యాలీకి ఉత్తర ప్రదేశ్‌లోని డియోరియా నుంచి 20,000 మందిని తీసుకువచ్చారని బీజేపీ ఎద్దేవా చేసింది. బీజేపీ నేత, మాజీ కేంద్రం న్యాయ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ నేను రాహుల్ గాంధీ మాటలు విన్నప్పుడల్లా పార్లమెంటు లోపల, వెలుపల ఆయన ఏమి చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అణు బాంబు, హైడ్రోజన్ బాంబులకు ఎన్నికలకు ఏం సంబంధం? రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)