ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ శివార్లలోని సిల్తారా ప్రాంతంలో ఉన్న గోదావరి ఇస్పాత్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్‌లో ఒక నిర్మాణం కూలిపోవడంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో అనేక మంది కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసు బృందాన్ని సంఘటనా స్థలానికి పంపాం. సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఐదుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారని ఆయన తెలిపారు. గాయపడిన కార్మికులను అధికారులు తక్షణమే ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో మరికొంత మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగించి, చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి అధికారులు, రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్లాంట్‌లోని నిర్మాణం ఎందుకు కూలిపోయింది అనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది.
గోదావరి ఇస్పాత్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్‌లో నిర్మాణం కూలిపోవడంతో ఐదుగురు కార్మికులు దుర్మరణం
September 27, 2025
0
Tags