పాకిస్తాన్ లో క్రికెట్ గ్రౌండ్‌లో బాంబు పేలి ఒకరు మృతి

Telugu Lo Computer
0


పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఒక్కసారిగా బాంబు పేలడంతో ఒకరు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. పేలుడు తరువాత మైదానం చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఊహించని పరిణామంతో క్రికెట్ ప్లేయర్లు, వీక్షకులు భయంతో పరుగులు పెట్టారు. దీంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పేలుడు తరువాత ఆటగాళ్లు అక్కడి నుంచి పరుగెత్తుతూ కనిపించారు. వారం క్రితం ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఓ పోలీస్ స్టేషన్ పై క్వాడ్‌కాప్టర్ సహాయంతో దాడి చేశారు. ఈ దాడిలో ఒక పోలీసు కానిస్టేబుల్, ఒక పౌరుడు గాయపడ్డాడు. ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం ద్వారా ఈ దాడికి పాల్పడినట్లు బజౌర్ జిల్లా పోలీసు అధికారి వకాస్ రఫీక్ తెలిపారు. ఈ దాడిలో ఒకరు మరణించగా.. కొంతమంది చిన్నారులు కూడా గాయపడినట్లు, వారు స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)