బంగాళాఖాతంలో 13వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని, ఆ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు కొంత పెరిగాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, అలాగే ఉక్కపోత కూడా ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే 13న బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వర్షం లేకపోవడంతో సాయంత్రం వేళ ఉక్కపోత వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు కూడా రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో సంగారెడ్డి, నల్లగొండ, హన్మకొండ, వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ములుగు, మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్, కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జనగాం, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
13న బంగాళాఖాతంలో అల్పపీడనం
September 07, 2025
0
Tags