రౌడీషీటర్లకు హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ హెచ్చరిక

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని రౌడీ షీటర్లకు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో లా&ఆర్డర్‌ మెయింటెన్స్‌ కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామని అన్నారు. సైబర్‌, ఆర్థిక నేరాల కట్టడికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో రౌడీషీటర్లు హల్చల్‌ చేస్తే పీడీ యాక్ట్‌లు పెడతాం. ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాగా, ఇటీవల తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ కమిషనర్‌గా సజ్జనార్‌ను.. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌ను నియమించింది. ఇంతకాలం ఆర్టీసీ ఎండీగా పనిచేసిన సజ్జనార్ హైదరాబాద్ సీపీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎండీగా మరో ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి నియమితులయ్యారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత సజ్జనార్ యూనిఫాం వేసుకోనున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)