హైదరాబాద్ నగరంలో విజయ్ దేవడా అనే మార్వాడీ పై ఆర్కేపురం కార్పొరేటర్ రాధ భర్త ధీరజ్ రెడ్డి దాడి చేశాడు. అయితే ఈ దాడికి రాజకీయ విభేదాలే కారణమని తెలుస్తోంది. బీజేపీలో నెలకొన్న గ్రూపు తగాదాలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. ఆర్కేపురంలో విజయ్ దేవడా అనే మార్వాడీ ఏర్పాటు చేసిన వినాయకుని దర్శనానికి సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిని ఆహ్వానించాడు. ఈ క్రమంలో తన అనుమతి లేకుండా మరో కార్పొరేటర్ ను తన డివిజన్ కు ఎలా పిలుస్తావంటూ తనపై దాడి చేశారని విజయ్ ఆరోపించారు. మహేశ్వరం అయినా ఆర్కే పురంలో తన అనుమతి లేనిదే ఎవరు ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని ధీరజ్ రెడ్డి హుకుం జారీ చేశాడని ఆయన ఆరోపించారు. ధీరజ్ రెడ్డితో పాటు మరో 20 మంది ఆయన అనుచరులు తనను కిడ్నాప్ చేసి పార్టీ అఫీసుకు తీసుకువెళ్లి మెడకు పార్టీ కండువాలు బిగించి హత్య చేసే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. మార్వాడోడా నీకెందుకు రాజకీయం అంటూ తనను దూషించారని వాపోయాడు. ఈ సందర్భంగా ధీరజ్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు విపరీతంగా కొట్టారని పేర్కొ్న్నాడు. విషయం తెలుసుకున్న తన తండ్రి, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని తనను విడిపించి తీసుకువెళ్లి ఆస్పత్రిలో చేర్పించారని తెలిపాడు. రెండు రోజులు చికిత్స అనంతరం దిశ్చార్జ్ అయినట్లు వివరించాడు. కాగా ధీరజ్ రెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడ్డ విజయ్ మాట్లాడుతూ తనకు రాజకీయ మైలేజ్ వస్తుందన్న కక్ష్యతోను తనపై దాడి చేశారని ఆరోపించారు. తనకు ధీరజ్ రెడ్డితో ప్రాణభయం ఉందని విజయ్ ఆందోళన వ్యక్తం చేశాడు. కేవలం రాజకీయ కక్షతోని తనపై దాడి చేసిన ధీరజ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై తను మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశానన్నారు. తను ఇకపై ఆర్కేపురంలో రాజకీయం చేస్తానని విజయ్ సవాల్ విసిరారు.
మార్వాడీపై ఆర్కేపురం కార్పొరేటర్ రాధ భర్త ధీరజ్ రెడ్డి దాడి
September 03, 2025
0
Tags